దేవి నవరాత్రులలో విజయదశమి ప్రశస్తి ?

cheruku raja
 అశ్వనీ నక్షత్రం పౌర్ణమి రోజున వస్తే అది ఆశ్వీయుజ మాసమౌతుంది. ఆశ్వీయుజ శుద్ద పాడ్యమి మొదలుకొని మహర్నవమి వరకు దేవి నవరాత్రులను జరుపుకుంటాము. ఈ నవరాత్రుల (తొమ్మిది రోజుల )లో ‘‘ దుర్గమ్మ ’’ ని తొమ్మిది విధాలుగా అంటే బాలాత్రిపుర సుందరి, మహాలక్ష్మి, గాయత్రి, అన్నపూర్ణ, సరస్వతి, శ్రీలతా త్రిపురసుందరి, దుర్గ, మహిషాసురమర్థిని, రాజరాజేశ్వరిగా భావించి విభిన్నమైన అలంకారాలతో అర్చిస్తారు. ఈ నవరాత్రి వ్రతానికి పదవరోజైన ‘‘ విజయదశమి ’’ ని ముగింపుగా పేర్కొన్నారు. ఈ పదవరోజున దేవి ఉపాసకులు అమ్మవారిని ఉపాసించి విజయాన్ని పొందుతున్నారు. కాబట్టి ‘‘ విజయదశమి ’’ అన్నారు. శ్రీరాముడు ఈ విజయదశమి రోజునే రావణాసురుణ్ణి సంహరించాడనీ, అర్జునుడు కూడా విజయదశమి రోజునే ఉత్తర గోగ్రహణంలో విజయాన్ని పొందాడనీ తెలస్తున్నది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: